హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పదిరోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వస్తానని చేనేత, జౌళీ శాఖామాత్యులు శంకర్‌రావు ఆదివారం అన్నారు. అయితే అధిష్టానం తనకు అనుమతించాల్సి ఉంటుందన్నారు. అధిష్టానం అనుమతి ఇస్తే పదిరోజుల్లో జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకు వస్తానని చెప్పారు. జగన్‌కు కావాల్సిన కౌన్సెలింగ్ తాను ఇస్తానన్నారు. ఒకవేళ తాను జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకు రాకుంటే రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ ఛాలెంజ్ చేశారు. జగన్ వెంట అంతా ఐరన్ లెగ్‌లు ఉన్నారన్నారు. వారంతా ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
జగన్ ఎప్పటికైనా తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మే 10 తేది వరకు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ప్రజలు కూడా తెలంగాణ కోసం ఓపిక పట్టాలని చెప్పారు. జగన్ ప్రకటించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని పథకాలు అన్నీ కాంగ్రెస్ పార్టీవే అన్నారు.
Minister Shankar Rao hoped today that Ex MP YS Jaganmohan Reddy will come back to Congress soon. He challenged that he will took Jagan in to congress, if high command will give permission.
Story first published: Sunday, March 13, 2011, 14:26 [IST]