తెలంగాణ వెంటనే ప్రకటించాలి: యోగా గురు బాబా రామ్‌దేవ్
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం వరంగల్ జిల్లాలో తప్పు పట్టారు. భారత్ స్వాభిమాన్ యాత్రలో భాగంగా ఆయన వరంగల్ జిల్లాలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సి ఉంటుందని అన్నారు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యమం హింసాత్మకంగా మారే కంటే ముందే తెలంగాణ ఏర్పాటు శ్రేయస్కరం అన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇలా తాత్సారం చేస్తే సరికాదన్నారు. కేంద్రం తెలంగాణ ఆలస్యం చేస్తే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చాలని సూచించారు. కాగా రాబోయే జూన్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో అవినీతి బాగా పేరుకు పోయిందన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పార్టీ ఉంటుందని చెప్పారు.
Well Known yoga guru Baba Ramdev blamed central government on Telangana issue today in Warangal. He demanded to announce Telangana state soon. He said centre is neglecting issue. He said he will announce his party in june.
Story first published: Monday, March 14, 2011, 10:15 [IST]