ఎన్టీఆర్ "డ్రాగన్" మూవీ గ్లింప్స్ రిలీజ్.. కలెక్షన్ల ఊచకోతకు సిద్ధమా !!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' తారక్ - దర్శకుడు ప్రశాంత్ నీల్‌ల కాంబోలో రూపొందుతున్న సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అభిమానుల కోసం ఏకంగా 4 నిమిషాల 28 సెకన్ల నిడివి గల గ్లింప్స్‌ను మే 20న విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ గ్లింప్స్ వీడియో ద్వారా 'డ్రాగన్' ప్రపంచం, అందులోని కీలక పాత్రలను పరిచయం చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించడంతో పాటు, 1967 నాటి నల్లమందు తోటలు, నల్లమందు యుద్ధాలు, ప్రమాదకరమైన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, డ్రగ్ పెడ్లర్ల వంటి అంశాలను చూపించారు. ప్రపంచంలోనే నల్లమందును అధికంగా పండించే ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాలలో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

ntr-and-prashanth-neel-movie-title-as-dragon-and-first-glimpse-video-also-released-and-got-viral-on

కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర ద్వారా ఎన్టీఆర్ పాత్ర పరిచయం చేశారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి 'ప్రధాన హంతకుడు' అయిన 'లూగర్' పాత్రలో కనిపించనున్నారు. అతని లీన్, రఫ్‌ లుక్, గంభీరమైన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరీ ముఖ్యంగా "దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మార్చిపోవడం. నిద్రపోయినప్పుడు నేను చంపినవాళ్ల ముఖాలు నా కలలోకి రావు. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు" అంటూ ఎన్టీఆర్ తన బేస్ వాయిస్‌తో చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక అలానే సినిమాలో విలన్లు పెరిగినప్పుడు, వారిని అడ్డుకోడానికి రంగంలోకి దిగే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ 'రఘువీర్ రాథోడ్'గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను పరిచయం చేశారు. మలయాళ నటుడు బిజు మీనన్, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, గురు సోమసుందరం వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన గత విజయవంతమైన చిత్రాలైన 'కేజీయఫ్‌', 'సలార్‌' తరహాలోనే డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. ఇది స్టైలిష్‌గా, ఉత్కంఠగా కనిపిస్తున్నప్పటికీ, విజువల్స్, యాక్షన్ మాత్రం ఆయన మునుపటి చిత్రాలను గుర్తుకు తెస్తున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, భువన్ గౌడ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మరోవైపు టీ-సిరీస్ అధినేతలు గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'డ్రాగన్' సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+