యెడ్డీకి మళ్లీ తలనొప్పులు: 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు

బుధవారం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్‌లకు యెడ్డీపై అసంతృప్తితో ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేలు వారికి వినతి పత్రం ఇచ్చారు. సిఎం ఇప్పటికే భూ కుంభకోణం వంటి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఆయనను పదవి నుండి తప్పించాలని, లేదా ఆయనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ లేఖ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన యెడ్డీ కాసేపు ఉండి హఠాత్తుగా బయటకు వెళ్లిపోయారు.
వారి డిమాండ్‌కు తోడు యెడ్డీ హఠాత్తుగా బయటకు వెళ్లడంతో ఏ సమయంలోనైనా రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే గతంలో ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు అధిష్టానం పరిష్కరించినట్లుగానే మరోసారి పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications