మూడో రోజుకు చేరిన సిపిఎం నాయకుడు రాఘవులు దీక్ష

ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరిస్తే తమ పార్టీకి ప్రతిష్ట పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చునని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని, వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తామని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని రాఘవులును పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు విమర్శించారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వెర్రి చేష్టలు చేస్తోందని ఆయన అన్నారు.
Comments
English summary
CPM state secretary BV Raghavulu's fast reached third day today. TDP leaders K Erramnaidu and Kambhampati Ranmohan visited Raghavulu.
Story first published: Saturday, March 19, 2011, 11:27 [IST]