హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను కిరణ్ కుమార్ రెడ్డి భయపెడుతున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఉన్నంత కాలం ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆటాడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు తీవ్రంగా ఎండగడుతూ, రోశయ్యను అసమర్థ ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ, కాంగ్రెసు శాసనసభ్యులను తన వైపు ఆకర్షిస్తూ కాంగ్రెసు పార్టీకి, రోశయ్యకు నిద్ర పట్టకుండా చేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. జగన్‌ ఎత్తులకూ జిత్తులకూ ఏ మాత్రం బెదరకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్‌ను దెబ్బ కొట్టడానికి తగిన వ్యూహరచనను ఆయన ఎంచుకున్నారు. దాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మంత్రులను కట్టడి చేయడంలో, కాంగ్రెసుకు అనుకూలంగా పని చేయించడంలో విజయం సాధించారనే చెప్పాలి. మంత్రులు ఎవరు కూడా రోశయ్య మాట వినేవారు కాదనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా సాగింది. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ, వారికి లక్ష్యాలు నిర్దేశిస్తూ పని చేయిస్తున్నారు. తన సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రోశయ్యకు అప్పట్లో అవకాశం చిక్కలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు సహకరిస్తారని భావించినవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం మంత్రివర్గంలో నలుగురైదుగురు మంత్రులున్నారు. స్వయంగా వైయస్ జగన్ బాబాయ్ ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా మారారు.

మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, పి. శంకరరావు వంటివారే కాకుండా ఇతర మంత్రులు కూడా జగన్‌కు వెసులుబాటు కల్పించడం లేదు. అనంతపురం జిల్లాలో వైయస్ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లకు మంత్రి పదవులు ఇచ్చి, వారి వ్యతిరేకి అయిన జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. దానివల్ల వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులై అయినా ఆ ఇద్దరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి సహకరిస్తున్నారు. అలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలను కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి నుంచే నేర్చుకున్నట్లున్నారు. దాన్నే వైయస్ జగన్‌పై ప్రయోగిస్తున్నారని చెప్పవచ్చు.

English summary
Political analysts say that CM Kirankumar Reddy is successfully facing YSR Congress party leader YS Jagan. Earlier CM Rosaiah is not ab;e to curtail YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X