జూలై 7 నుంచి 'భద్ర రాజయోగం'.. కర్కాటకం, మీనం, ధనుస్సు వారికి కాసుల వర్షం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో జరగబోయే ఒక కీలక గ్రహ మార్పు కొన్ని రాశుల వారి తలరాతను మార్చబోతోంది. బుధ గ్రహ ప్రభావం వల్ల జూలై 7వ తేదీ నుంచి అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన 'భద్ర రాజయోగం' ప్రారంభం కానుంది. బుధుడు తన సొంత రాశి అయిన మిథునంలో బలంగా స్థిరపడటం వల్ల ఈ అరుదైన శుభ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడిగా భావిస్తారు. ఈ భద్ర రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి కెరీర్, ఆర్థిక స్థితి ఒక్కసారిగా దూసుకుపోనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం
మీన రాశి
మీన రాశి వారికి ఈ రాజయోగం వల్ల కుటుంబంలో ఆనందం, ఆస్తి పరమైన లాభాలు కలుగుతాయి. కోర్టుల్లో లేదా కుటుంబంలో చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు త్వరలోనే సమసిపోతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆశించిన ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అంతకంతకూ పెరుగుతాయి. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగం, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా మారబోతోంది. ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో భారీ విజయాలకు బాటలు వేస్తాయి.

కర్కాటక రాశి
భద్ర రాజయోగం వల్ల కర్కాటక రాశి వారి జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. ఆఫీసులో పైఅధికారుల ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా, ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలిస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపార పరంగా కాసుల వర్షం కురిపించబోతోంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అదృష్టం వరిస్తుంది. మార్కెట్లో మీ క్రెడిబిలిటీ, పరపతి విపరీతంగా పెరుగుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లాభదాయకమైన కొత్త ఒప్పందాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం.














Click it and Unblock the Notifications