ఆ స్టార్ డైరెక్టర్ అలా అడుగుతాడని అనుకోలేదు - టాలీవుడ్ నటి

మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి "మౌనీషా చౌదరి" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన మోడలింగ్ కెరీర్ గురించి.. సినిమా ఛాన్సుల గురించి ఓపెన్ అయ్యారు. కాగా తనకు ఇష్టమైన హీరో ప్రభాస్ అని.. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చిన్న వయసులోనే తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నోరు విప్పారు. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మోడలింగ్ కెరీర్..

కాగా అమెరికాలోనే తన కెరీర్ ప్రారంభమైందని.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు అమెరికన్ బ్రాండ్స్‌కు మోడల్‌గా పనిచేశానని మౌనిషా తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ర్యాంప్ వాక్ చేశానని.. బిల్‌బోర్డ్స్‌పై తన ఫొటోలు కనిపించాయని చెప్పారు. అలాగే అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల కోసం కూడా పలు ప్రకటనల్లో నటించినట్లు వెల్లడించారు. ఇక హీరోయిన్లలో శ్రీలీల అంటే చాలా ఇష్టమని చెప్పారు. తన ఫ్రెండ్స్ చాలా మంది శ్రీలీలకు ఆమెకు పోలికలు ఉన్నాయని అంటుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. శ్రీలీలతో కలిసి ఒక యాడ్‌లో నటించాలని కోరిక ఉందంటూ తన మనసులో మాటని బయటపెట్టారు.

mounisha-chowdary-who-got-fame-as-model-and-social-media-influencer-comments-about-star-director-mis

చేదు అనుభవం..

చిన్న వయసులోనే సినిమా అవకాశాల పేరుతో ఎదుర్కొన్న అసభ్యకర ప్రశ్నలు తనలో ఇండస్ట్రీపై భయాన్ని పెంచాయని ఆమె వెల్లడించారు. ఒక స్టార్ డైరెక్టర్‌తో పాటు మరికొన్ని ఆడిషన్ల సమయంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు 16-17 ఏళ్లు ఉన్నప్పుడు సినిమాలో ఛాన్స్ గురించి మాట్లాడటానికి ఓ స్టార్ డైరెక్టర్ వారి వచ్చాడన్నారు. ముందుగా సినిమాల్లో నటించాలని ఉందా అని అడిగాడని.. సమాధానం చెప్పేలోపే 'నీ బాడీ సైజ్ ఎంత? నీ తొడల సైజ్ ఎంత?' అంటూ అసభ్యకరంగా ప్రశ్నించాడని ఎమోషనల్ అయ్యారు.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వీడియోలపై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని.. అయితే అలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోనని తెలిపారు. తనకు నచ్చిన పని తాను చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కాలేజ్‌లో చదువుతున్న రోజులలోనే తనకు తెలుగు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయని.. అయితే కుటుంబ సభ్యులు అప్పుడు సినిమాల్లోకి వెళ్లడానికి అంగీకరించలేదని చెప్పారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉండేదన్నారు.

మరోవైపు ఇటీవల రెండు మూడు తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో కూడా అవకాశం వచ్చిందని.. అయితే ధైర్యం చేయలేక ముందుకు వెళ్లలేదని చెప్పారు. సినిమా అవకాశాల పేరుతో కొంతమంది అనుచితంగా ప్రవర్తించడం వల్లే తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని మౌనీషా వెల్లడించారు. అయితే తనకు నటనపై ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదని, సరైన అవకాశం వస్తే భవిష్యత్తులో సినిమాల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+