బద్రీనాథ్-కేదార్ నాధ్ ఆలయంలోనూ కానుకల చోరీ ? భక్తులకు మరో షాక్..!

ఓవైపు అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) లో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాల్ని ఇంటి దొంగలే అత్యంత చాకచక్యంగా చోరీ చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తుండగా.. ఇప్పుడు మరో ప్రఖ్యాత ఆలయం బద్రీనాథ్-కేదార్ నాథ్ లో (Badrinath-Kedarnath) సైతం ఇలాంటి ఘటనే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బద్రీనాథ్ ధామ్‌లో విరాళాలు , కానుకల దుర్వినియోగం (Donation Theft) జరిగిందన్న అంశంపై శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) విచారణను ప్రారంభించింది.

ఈ వ్యవహారంపై నిష్పాక్షికమైన, వాస్తవాల ఆధారిత విచారణ జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. అలాగే సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరారు. విచారణలో ఏ ఉద్యోగి అయినా దోషిగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లక్షలాది మంది భక్తులకు ఈ పుణ్యక్షేత్రంపై ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, 24 గంటల్లోనే దీనిపై చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

After Ayodhya Donation Theft Allegations Hit Badrinath Kedarnath Temple Probe Ordered

కానుకల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులందరికీ ఆలయ ట్రస్ట్ సీఈవో ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హిందూ సంస్థ 'భైరవ్ సేన' వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ ఖత్రీ, BKTC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగద్‌కు పంపిన ఫిర్యాదు లేఖ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 3న పంపిన ఆ లేఖలో, బద్రీనాథ్ ధామ్‌లో కానుకల లెక్కింపు సమయంలో చోరీ జరిగిందనే సమాచారం తనకు అందిందని పేర్కొన్నారు.BKTC చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకునే వ్యక్తి కానుకల నుండి సొమ్మును అపహరించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అలాగే, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని , నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

After Ayodhya Donation Theft Allegations Hit Badrinath Kedarnath Temple Probe Ordered

ఆలయ కమిటీ పత్రాల ప్రకారం, అప్పటి CEO విశాల్ మిశ్రా ఏప్రిల్ 9న జారీ చేసిన జాబితాలో 'థాలి' (కానుకల పళ్లెం) లెక్కింపు కమిటీ సభ్యుడిగా ప్రమోద్ నౌటియాల్ పేరు చేర్చారు. ఆయన 2014 నుండి. అంటే అప్పటి చైర్మన్ గణేష్ గోడియాల్ హయాంలో ప్రారంభించి, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. తదుపరి చైర్మన్ల హయాంలోనూ అదే పాత్రలో కొనసాగుతున్నారు. ఆలయ కమిటీ వర్గాల సమాచారం ప్రకారం, బద్రీనాథ్ ధామ్‌లో కానుకల లెక్కింపు ఒక నిర్దిష్ట విధానం ఉంటుంది. విరాళాల సంచులను తెరిచేటప్పుడు ప్రకటనలు చేస్తారు. ఈ ప్రక్రియలో బ్యాంక్ ఉద్యోగులు, ఆలయ కమిటీ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు , ఇతర అధీకృత సభ్యులు పాల్గొంటారు. పారదర్శకతను నిర్ధారించడానికి మొత్తం లెక్కింపు ప్రక్రియ నిర్ణీత నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. జూలై 2న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కానుకల లెక్కింపు జరుగుతుండగా చోరీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+