కిరణ్ కుమార్ రెడ్డిపై నిందలేసిన కెసిఆర్, సిఎం పనే అని ఆరోపణ

తమ పార్టీ ఉద్యమ పార్టీగా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వివిధ రకాలైన 43 పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని కొనసాగించిన చరిత్ర పార్టీకి ఉందని చెప్పారు. వనరులున్నా, లేకపోయినా ఉద్యమం కోసం అనేక త్యాగాలు చేశామన్నారు. ఉద్యమ శత్రువులతో, ప్రభుత్వంతో పోరాడుతూ ఉద్యమాన్ని బతికించుకున్నామని, గమ్యాన్ని ముద్దాడే వరకు ఇది కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. ఉద్యమ పార్టీగా క్రమశిక్షణ, కట్టుబాటు, నిబద్దత ఉండాలని భావించామన్నారు. కానీ మూడు ఓట్లు క్రాస్ అయినట్లు పార్టీ దృష్టికి వచ్చిందని, తొందరపాటు చర్యలు తీసుకోకుండా పార్టీకి సాంకేతికంగా ఉన్న కోడ్‌తోపాటు శాసనసభా పక్షం ఇచ్చిన నివేదిక తదితర ఆధారాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి వారిని సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. ఉద్యమ పార్టీగా ఉద్యమ పవిత్రతను కాపాడే బాధ్యత తమపై ఉందని, అందుకే మొదట క్రాస్ ఓ
టింగ్‌ను ధ్రువీకరించుకున్నామని, ఇక ఉపేక్షించవద్దనే ఉద్దేశంతోనే చర్య తీసుకున్నామన్నారు. పార్టీ నిబద్ధత, క్రమశిక్షణ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ముందు ఎంతటి వారైనా పెద్దవారు కాదని, అందుకే ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ పార్టీలో తీర్మానం చేశామని వెల్లడించారు. తాను తప్పు చేశానని, క్షమించాలని ఒక ఎమ్మెల్యే కోరారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications