తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్తాం: రాయపాటి

రాష్ట్ర విభజ అంశంపై మే, జూన్ నెలల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకునే వీలుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్ణయం వెలువడే అవకాశం లేదన్నారు. తాము రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ వాదనను గట్టిగా వినిపించేందుకు వారంతా ఐక్యంగా వివిధ రూపాల్లో తమ ఒత్తిడి తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ వాదనలతో రాష్ట్రానికి చెందిన ఎంపీల మధ్య భేదాభిప్రాయాలు పెరగకుండా చూసేందుకు ఈనెల 25, 26 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా అధిష్ఠానం చెప్పే విషయాలకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు.












Click it and Unblock the Notifications