వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు చూడనున్న సోనియా గాంధీ

పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచుకు దాదాపు 60 మంది పార్లమెంటు సభ్యులు వెళ్తారని భావిస్తున్నారు. వీరిలో నలుగురైదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ఉంటారు. కేంద్ర మంత్రులు కూడా పలువురు ఈ మ్యాచుకు వెళ్లే అవకాశాలున్నాయి. పలువురు వివిఐపిలు ఈ మ్యాచుకు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
చండీఘర్, మొహాలీ, పంచకుల సాయుధ బలగాలతో నిండిపోయాయి. వ్యూహాత్మకంగా విమాన నిరోధక గన్‌లను ఏర్పాటు చేశారు. మొహాలిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. భారత వైమానిక దళాల హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. ఫైటర్ జెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. బహుళ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ బలగాలు ఇప్పటికే మోహరించాయి.