హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తులు చూసుకోవడానికి చంద్రబాబు సింగపూర్ వెళ్లారు: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచిన సమయంలో ఆస్తులు చూసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సింగపూర్, దుబాయ్ పర్యటనలకు వెళ్లారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు బాధ్యత ఏమిటని ఆయన అడిగారు. రహస్య కార్యకలాపాలను చూసుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. చీమూ నెత్తురు ఉంటే తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ వెంట వస్తున్న శాసనసభ్యులపై కాంగ్రెసు నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లకు జగన్ వెంట వస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని ఆయన అడిగారు.

ఓ శాసనసభ్యుడు రాజీనామాను ఆమోదించాలని దీక్ష చేపట్టారని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మ్యాచు ఫిక్సింగుకు పాల్పడి రాజీనామా ఆమోదాన్ని ఆపుతున్నారని, చేసిన రాజీనామాలనే ఆమోదించే ధైర్యం లేని కాంగ్రెసు పార్టీకి తమ వెంట వస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించినా, జెసి, మంత్రి రఘువీరా రెడ్డి బహిరంగ విమర్శలు చేసుకున్నా కాంగ్రెసు చర్యలు తీసుకునే స్థితిలో లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీకి కడప పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. పార్టీ జెండాపై చర్యలు తీసుకునే హక్కు ఎన్నికల కమిషన్‌కు లేదని, కడుపుమంటతోనే తమ జెండాపై కాంగ్రెసు నాయకులు అభ్యంతరం చెబుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ పథకాలకు తూట్లు పొడుస్తూ వైయస్సార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు.

English summary
YSR Congress Party leader Amabati Rambabu lashed out at TDP president N Chandrababu Naidu. He said that Chandrababu went Singapore to look after his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X