కృష్ణా జిల్లా నేతలు వల్లభనేని వంశీ, ఉమలపై చంద్రబాబు సీరియస్

పార్టీ నాయకులు వ్యక్తిగత ఎజెండాలతో మీడియాకు ఎక్కితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ నాయకులు వల్లభనేని వంశీ, దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్ర విభేదాలతో మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే. తనపై తీవ్ర విమర్శలు రావడంతో దేవినేని ఉమా మహేశ్వర రావు పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఉమా మహేశ్వర రావు రాజీనామా చేసినందున తాను విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం లేదని వల్లభనేని వంశీ చెప్పారు. తాను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తన వద్ద కూర్చుని పరిష్కరించుకోవచ్చునని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications