బెజవాడ ఇష్యూపై హరికృష్ణ సీరియస్: దేవినేని తీరుపై అసంతృప్తి!

దీనిపై హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన పర్యటన సందర్భంగా దేవినేని కార్యకర్తలు కోరికను తన వరకు తీసుకు రాకపోవడం పట్ల కూడా ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపి బలపడాలంటే జిల్లా నేతలంతా సమన్వయంతో కలిసి వెళ్లాలని హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఇలా గొడవలు రోడ్డెక్కడం పట్ల ఆయన మనస్తాపం చెందారని సమాచారం. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత దేవినేని, వల్లభనేనిలతో మాట్లాడి ఇద్దరూ సమన్వయంతో వెళ్లేందుకు కృషి చేసేందుకు ప్రయత్నాలు చేసే దిశలో హరికృష్ణ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications