హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటీపై నాకు ఆసక్తి లేదు, పార్టీ ఆదేశిస్తే వేరే సమస్య: మైసూరా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు అభ్యర్థిగా కానీ, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తి తనకే మాత్రం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మైసూరారెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో విలేకరులు ఆ విషయంపై ప్రశ్నించారు. తనకు పోటీ చేయాలనే ఆసక్తి లేదని, అయితే పార్టీ నిర్ణయిస్తే ఆ సమస్య వేరని ఆయన అన్నారు.

త్వరలో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందన్నారు. ఉగాది తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారని అన్నారు. పార్టీలో చర్చించి అంతిమంగా అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ టిడిపికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెసు, టిడిపి, వైయస్ జగన్‌ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అన్ని పార్టీలో పోటీ చేస్తాయని, అయితే టిడిపికే విజయావకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు రెండుగా విడిపోవడం, ప్రభుత్వ వైఫల్యం టిడిపిని గెలిపిస్తుందన్నారు.

కాగా ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించే విషయంపై దృష్టి సారించాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో తాము చెప్పామని అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో ధన ప్రభావం తగ్గించాలని ఈసీని కోరినట్లుగా చెప్పారు.ఈవిఎం టాంపరింగ్ పై కూడా చెప్పినట్లు చెప్పారు.

English summary
TDP senior leader MV Mysoora Reddy said today that he is not interested to contest from Kadapa in by election. He said party will decide candidates. He was talk with media after participating EC's all party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X