హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల నుండి తప్పించుకోబోయి భవనంపై నుండి దూకి వ్యక్తి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: పోలీసుల నుండి తప్పించుకోబోయి ఓ భవనంపై నుంచి దూకిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంఘటన శుక్రవారం హైదరాబాదులో చోటు చేసుకుంది. సికింద్రాబాదులోని టాటా కన్సల్టెంటులో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నాచారంలో ఉంటాడు. ఓ కేసులో నిందుతుడిగా అనుమానిస్తూ రాంగోపాల్ పేట పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకునేందుకు వారు ఆయన ఇంటికి వెళ్లారు.

అయితే పోలీసులనుండి తప్పించుకునే ఉద్దేశ్యంతో ఆయన ఓ భవనం యొక్క నాలుగో అంతస్తుపై నుండి దూకారు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసును పోలీసులు రాంగోపాల్ పేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయితే చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించారు. అయితే పోలీసులు శ్రీనివాసును గత కొంతకాలంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు పోలీసులు శ్రీనివాసును తీసుకు వెళ్లి వేధించారని, ఇప్పుడు కూడా వేధిస్తారనే ఉద్దేశ్యంతోనే శ్రీనివాసు దూకి ఉంటాడని వారు అంటున్నారు.

English summary
Police accused Srinivas dead today by jumping from building. Srinivas is doing in Tata consultancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X