హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు తలనొప్పి: వల్లభనేని వంశీ రాజీనామా, కొడాలి తిరుగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
హైదరాబాద్: కృష్ణా జిల్లాలో పార్టీ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించాయి. పార్టీలోని నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ పార్టీ అర్బన్ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమా మహేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవినేని ఉమపై తాను చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన అంటున్నారు. ఇదే సమయంలో దేవినేని తీరును తప్పు పడుతూ గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని ఏకంగా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

ఎన్టీఆర్ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణను దేవినేని అవమానించారని గుడివాడ టిడిపి శాసనసభ్యుడు కొడాలి నాని విమర్శించారు. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే తాడోపేడో తేల్చుకుంటానని ధ్వజమెత్తారు. గతనెల 28న హరికృష్ణ చల్లపల్లి పోస్టాఫీసులో నూతన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చినపుడు హరికృష్ణకు జిల్లా పార్టీ తరఫున అవమానం జరిగిందన్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వస్తే చూపిన అత్యుత్సాహం, అతి గౌరవం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినపుడు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ పోకడలను మానకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

English summary
Differences cropped up in Krishna district TDP. TDP leaders Vallabhaneni Vamsi and Kodali Nani are opposing party Krishna district president Devineni Umamaheswara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X