హైదరాబాద్: కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంవి మైసురా రెడ్డి పోటీ చేయనున్నారు. కడప జిల్లా నేతలతో విస్తృతంగా చర్చించిన తర్వాత మైసురా రెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కాంగ్రెసులో వైయస్ రాజశేఖర రెడ్డి ఆధిపత్యం పెరగడంతో సహించలేక మైసురా రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. వైయస్ రాజశేఖర రెడ్డితో ఆయనకు మొదటి నుంచి వైరం ఉంది. పులివెందుల శాసనసభా స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎం. రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి) పేరు ఖరారైంది.
కడప జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలోలో చేరుతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకటం లేదని అందుకే తమ అభ్యర్థులను ప్రలోభపెడుతున్నారని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు. ప్రలోభాలకు లొంగి ఒక్కరో ఇద్దరో తమ పార్టీ నాయకులు కాంగ్రెసులోకి వెళ్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. తమకు బలమైన క్యాడర్ ఉందని, రెండు స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
TDP president N Chandrababu Naidu announced party candidates for Kadapa loksabha and Pulivendula assembly seats. MV Mysura Reddy will contest from Kadapa loksabha seat against YS Jagan.
Story first published: Wednesday, April 6, 2011, 17:12 [IST]