PM Modi: బెంగాల్ ఫలితాల్ని ఎప్పుడూ మర్చిపోం..! మోడీ కీలక వ్యాఖ్యలు..!
ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఓ ఎత్తు.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా బెంగాల్లో తొలిసారి గెలిచిన బీజేపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ (PM Modi) ఎక్స్ లో తన సంతోషం పంచుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు చిరకాలం గుర్తుండిపోతాయని ఆయన తెలిపారు. ప్రజాశక్తి గెలిచిందని, బీజేపీ సుపరిపాలన రాజకీయాలు విజయం సాధించాయని మోడీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి ఒక్కరికీ ఆయన నమస్కారాలు తెలిపారు. ప్రజలు బీజేపీకి అద్భుతమైన విజయం ఇచ్చారన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి మా పార్టీ సాధ్యమైనదంతా చేస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని తాము అందిస్తామని మోడీ తెలిపారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో భారీ సంబరాలకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు.














Click it and Unblock the Notifications