విజయ్ తొలి బహిరంగ పర్యటన! సీఎం కాన్వాయ్ ఎంట్రీ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీవీకే (TVK) అధినేత, దళపతి విజయ్.. తన తొలి విజయ యాత్రను ప్రారంభించారు. తన నివాసం నుంచి బయలుదేరిన విజయ్, రాజకీయాల్లో కొత్త శకాన్ని ప్రారంభించే ముందు తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం.

నీలాంకరైలోని తన నివాసం నుంచి బయలుదేరిన విజయ్, నేరుగా అడయార్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఎస్.ఏ. చంద్రశేఖర్ - శోభల ఆశీస్సులు తీసుకోవడం ద్వారా తన ప్రస్థానాన్ని మరింత అర్థవంతం చేసుకుంటున్నారు.

Thalapathy Vijay First Public Move Post-Victory Heading to Parents Home for Blessings amp amp Loyola College

కౌంటింగ్ సెంటర్ మీదుగా లోయోలా కాలేజీకి:

తల్లిదండ్రులను కలిసిన అనంతరం విజయ్ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ప్రతినిధులను కలిసి, పరిస్థితులను సమీక్షించిన తర్వాత తన విద్యాభ్యాసం సాగిన లోయోలా కాలేజీకి చేరుకోనున్నారు. గెలుపు తర్వాత విజయ్ చేస్తున్న ఈ పర్యటన అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతోంది.

విజయ పథం.. నా కొడుకు సీఎం కాబోతున్నాడు!
విజయ పథం.. నా కొడుకు సీఎం కాబోతున్నాడు!

నీలాంకరైలో పోలీసుల పహారా - అభిమానుల కోలాహలం:

విజయ్ ఇంటి బయట భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. విజయ్ కాన్వాయ్ వెంట అభిమానులు నీరాజనాలు పలుకుతూ ర్యాలీగా వెళ్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

విజయ్ ఇంటికి త్రిష.. దళపతికి అదిరిపోయే వెల్కమ్!
విజయ్ ఇంటికి త్రిష.. దళపతికి అదిరిపోయే వెల్కమ్!

అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టిన విజయ్, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను దాటుకుని వస్తున్న ఈ యువ నాయకుడిని చూసేందుకు తమిళనాడు జనం రోడ్లపైకి పోటెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+