స్టాలినే సీఎం.. జరిగేది ఇదే.. కమల్ హాసన్ సంచలన ట్వీట్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమి సహజం అని అన్నారు. నా స్నేహితుడు, డీఎంకే అధినేత స్టాలిన్ అందుకు అతీతం కాదని తెలిపారు. అతను మళ్లీ పోరాటం చేస్తాడని.. అతను మళ్లీ విజయం సాధిస్తాడని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి కమల్ హాసన్ పూర్తిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇక 2018 ఫిబ్రవరిలో మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రారంభించారు కమల్ హాసన్. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ శాసనసభ ఎన్నికల్లో కమల్ హాసన్ సహా పార్టీ అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. అనంతరం పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమల్ హాసన్ పార్టీ బలహీన పడుతూ వస్తోంది. ఇక 2024 నుంచి డీఎంకే పార్టీకి కమస్ హాసన్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. తాజాగా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. అంతేకాక కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ సైతం ఘోర ఓటమి పాలైయ్యారు. దాంతో కమల్ హాసన్ ఈ షాకింగ్ ట్వీట్ పెట్టారు. స్టాలిన్ మళ్లీ గెలుస్తారంటూ చెప్పుకొచ్చారు.
ஜனநாயக அரசியலில் தேர்தல் ஓர் அங்கம்தான். அருமை நண்பர், திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைவர் திரு. @mkstalin அவர்கள் வெற்றியில் ஆர்ப்பரிப்பவரும் அல்ல. தோல்வியில் துவள்பவரும் அல்ல. மீண்டும் போராடுவார். மீண்டும் வெல்வார்.
— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026
ఇక తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైనట్లుగా భావించవచ్చు. దాదాపు 50 ఏళ్లపాటు డీఎంకే- అన్నాడీఎంకే ల చుట్టూనే తిరిగిన తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు విజయ్ రాకతో కొత్త పుంతలు తొక్కుతుంది. దళపతి విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ నెలకొల్పిన రికార్డును దాదాపు 50 ఏళ్ల తర్వాత విజయ్ సృష్టించడంతో యావత్ దేశం చూపు ఇప్పుడు విజయ్ వైపు చూస్తోంది.












Click it and Unblock the Notifications