విజయ్ ఇచ్చిన హామీలు ఇవే.. తొలి సంతకం దానిపైనే..??
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. దాదాపు 50 ఏళ్లపాటు డీఎంకే- అన్నాడీఎంకే ల చుట్టూనే తిరిగిన తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు విజయ్ రాకతో కొత్త మలుపు తిరిగింది. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మేరకు తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడమే మిగిలి ఉంది.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ అనేక హామీలు ఇచ్చారు. ఆయన విజయంలో టీవీకే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఓసారి చూస్తే.. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే వధువుకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3000 అలాగే ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని టీవీకే విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ఉన్నత చదువుల అవకాశాలను రూ.20 లక్షల వరకు రుణాలు, 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్ షిప్ అవకాశాలు అందిస్తామని పేర్కొన్నారు.

వీటితోపాటుగా స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి రూ.15వేలు అందజేస్తామని.. అలాగే రాష్ట్రంలోని 5 ఎకరాలలోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మరి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏ పథకాల్ని ముందు అమలు చేస్తారో చూడాల్సి ఉంది. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ పై విజయం సాధించారు. అలాగే తిరుచ్చి ఈస్ట్ లోనూ విజయ్ విక్టరీ కొట్టారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొలత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో చతికిలపడ్డారు. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 9 వేల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications