వెనక్కి తగ్గిన వల్లభనేని వంశీ, రాజీనామా ఉపసంహరణ

రాజీనామా చేయవద్దని కార్యకర్తలు పట్టుబట్టారు. దాదాపు అర గంట పాటు హైడ్రామా చోటు చేసుకుంది. రాజీనామా చేయవద్దని కృష్ణా జిల్లా నాయకులు గద్దె రామ్మోహన్ రావు, అనురాధ, కాట్రగడ్డ బాబు వంశీకి నచ్చజెప్పారు. తన తర్వాత వచ్చే పార్టీ అధ్యక్షుడికి తాను అన్ని విధాలా సహకరిస్తానని వంశీ హామీ ఇచ్చినా కార్యకర్తలు వినలేదు. తాను దేవినేని ఉమా మహేశ్వరరావు నాయకత్వంలో పని చేయలేనని, అందువల్లనే పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన కార్యకర్తలకు చెప్పారు.












Click it and Unblock the Notifications