హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'హరి'కథ కంచికి, చంద్రబాబుకు సారీ చెప్పిన వల్లభనేని వంశీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Vallabhaneni Vamsi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం ముగిసినట్లేనని భావిస్తున్నారు. అయితే, ఇది తాత్కాలికమా, శాశ్వతమా అనేది చెప్పలేని పరిస్థితే ఉంది. హరికృష్ణ కథ ప్రస్తుతానికి కంచికి చేరినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వ్యూహానికి హరికృష్ణ తలవంచక తప్పలేదని అంటున్నారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తొందరపడ్డారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవికి చేసిన వల్లభనేని వంశీ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. చంద్రబాబుకు ఆయన క్షమాపణలు చెప్పినట్లు కూడా సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను కలిసిన తర్వాతనే వంశీ చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని కూడా వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామా ఉపసంహరణపై స్పష్టమైన ప్రకటనేది వంశీ నుంచి రాలేదు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు సన్నిహితులైన పార్టీ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయి. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై వంశీ చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

నేను మీ నాయకత్వంలోనే పనిచేస్తానని వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడేది లేదని వంశీ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచన మేరకు వంశీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Dissident leader Vallabhaneni Vamshi met TDP president N \Chandrababu Naidu and explained about the bickerings in Krishna district party. It is said that Vamshi has withdrwan his resignation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X