కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ సగం ఖాళీ అవుతుంది: అనర్హత వేటు ఫిర్యాదుపై సబ్బం హరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
కడప: శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే ప్రక్రియను కొనసాగిస్తే శాసనసభ సగం ఖాళీ అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరడంపై ఆయన శనివారం ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆ విధంగా అన్నారు. చర్యలు తీసుకునే అధికారం అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి)కి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో తెగదెంపులేనని ఆయన అన్నారు. మార్పులున్నాయి కాబట్టే కడప ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికల వల్ల ఏ విధమైన మార్పులు చోటు చేసుకోవని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Congress MP, belongs to YSR Congress party leader YS Jagan. said that if the disqualification process of MLAs continue, half of the assembly will be vacated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X