బాబాది దేహమే అయితే ప్రపంచమంతా ఎలా దర్శనమిస్తారు: అనిల్‌కుమార్

మానసికంగా బాబా మన మదిలోనే ఉన్నారన్నారు. మనం బాబా మాటలను నిత్యం గుర్తు పెట్టుకోవాలన్నారు. షిర్డి సాయిబాబా సమాధి నుండే మాట్లాడతానని ఆనాడే చెప్పారని అన్నారు. అలాగే బాబా ఇప్పుడు దేహం విడిచి మాత్రమే వెళ్లారని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోడమే బాబా ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. సాయీ అని పిలిస్తే ఓయూ అని పలికే వాడు బాబా అని చెప్పారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ ట్రస్టు సభ్యులపై అపనమ్మకం వద్దని భక్తులను కోరారు. ట్రస్టు సభ్యులు బయటకు వెళితే లక్షల జీతం వస్తుందని దానిని వదులుకొని బాబా సేవలో ఉన్నారన్నారు. బాబా సేవలో చిత్తశుద్ధితో ఉన్న ట్రస్టు సభ్యులపై అనుమానాలు ఎలాంటివి పెట్టుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications