పుట్టపర్తికి బయలుదేరిన సిఎం, గవర్నర్, చంద్రబాబు, చిరంజీవి

Kiran Kumar Reddy
అనంతపురం: కోట్లాది భక్తుల దైవం భగవాన్ సత్యసాయి బాబా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, వైయస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

భగవాన్ సత్యసాయి బాబా మరణం వార్త వెల్లడికాగానే ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి బయలుదేరారు. ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కడప నుంచి పుట్టపర్తికి పయనమయ్యారు. బెంగళూరులో ఉన్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బాబా మరణవార్త వినగానే పుట్టపర్తికి బయలుదేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులే కాకుండా జాతీయస్థాయి నేతలు కూడా పలువురు తరలి రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+