ట్రస్టు సభ్యులు హామీ ఇచ్చారు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: సిఎం

విద్య, వైద్య రంగాల్లో బాబా చేసిన కృషి అమోఘం అని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బాబా ప్రజల దాహార్తిని తీర్చారని కొనియాడారు. బాబా సేవలు కొనసాగిస్తామని ట్రస్టు సభ్యులు కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని గట్టిగా నమ్మిన వ్యక్తి బాబా అన్నారు. కాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని సిఎం చెప్పారు. కాగా పుట్టపర్తికి కావాల్సినన్ని బస్సులు నడపాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications