ఎల్‌జీ అమ్ముల పోదిలోకి మరో క్రొత్త సినిమా 3డీ టీవీ

ఆధునాతన 3డీ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే (ఎల్‌సీడీ) టెక్నాలజీగా ఆ టెక్నాలజీ గుర్తింపు పొందింది. సినిమా 3డీ టీవీ ఆవిష్కరణ సందర్భంగా ఎల్‌జిఐఎల్ మేనేజింగ్ డెైరెక్టర్ సూన్‌క్వాస్ మాట్లాడుతూ నేటి వినూత్న అంచనాలకు మించిన రీతిలో సాంకేతిక నైపుణ్యాలను, ఉత్పాదనలను అందించేందుకు ఎల్‌జీ కట్టుబడి ఉందన్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ యువతను లక్ష్యంగా పెట్టుకుని మార్కెటింగ్ ప్రణాళికలను రూపొందించిందని, వీటి అమలుకు రూ.300కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
మంగళవారం ముంబయిలో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ వీటిని ఆవిష్కరించారు. ఫిల్మ్ పాటర్న్‌డ్ రిటార్డర్ సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ టీవీని తొలిసారిగా తీసుకొచ్చిన ఘనత ఎల్‌జీదే. తేలిక పాటి కళ్లద్దాలు ధరిస్తే సరిపోతుందని.. షట్టర్ గ్లాసెస్ ధరించినపుడు కలిగే ఒత్తిడి వీటి వల్ల కళ్లపై ఉండదని కంపెనీ చెబుతోంది. ధరలు రూ.94,990 -1,64,990.












Click it and Unblock the Notifications