కర్నూలు: మాజీ మంత్రి మారెప్ప మరోసారి వార్తలలో నిలిచాడు. ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తీసి వేసిందని ఆయన గురువారం ఆరోపించారు. తనకు సెక్యూరిటీని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. సెక్యూరిటీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి ఓడిన వారికి సెక్యూరిటీని ఇస్తున్నారని, తనకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాల, మాదిగల వ్యతిరేకిగా మారారారని ఆయన ఆరోపించారు. సెక్యూరిటీని తొలగిస్తే తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన చెప్పారు.