వైయస్ జగన్‌పై ముప్పేట దాడి: ఎడతెగని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి

ఇక కడప ఉప ఎన్నికలలో తన ప్రచారాన్ని శుక్రవారమే ప్రారంభించిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి జగన్‌పై మొదటి సారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ అవినీతిపరుడని, తనను ముఖ్యమంత్రిని చేయమంటూ తన వద్దకు వచ్చాడని విమర్శించారు. తనపై ఉన్న ప్రేమను కాంగ్రెసుకు ఓటు వేసి చూపించాలని ఓటర్లను కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన ప్రచారంలో జగన్ అవినీతిపై ఒంటికాలుతో లేచారు. జగన్ తప్పకుండా బిజెపితో కలుస్తారని భవిష్యత్తును చెప్పారు. బిజెపితో లోపాయికారి ఒప్పందం ఉన్నందువల్లే వారు పోటీ చేయడం లేదని చెప్పారు.
వీరంతా తమ తమ రాజకీయాలలో భాగంగా జగన్‌పై ధ్వజమెత్తగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత వరకు ఆయన వెన్నంటి ఉండి, జగన్ విజయవాడ జల దీక్షలో పాల్గొన్న జీవిత, రాజశేఖర్ దంపతులు జగన్‌ను ఓ పట్టు పట్టారు. జగన్ సంపాదించినది అంతా అవినీతి సొమ్ము అని, అవినీతి సొమ్ము కాదని జగన్ నిరూపిస్తే జగన్ దగ్గర పడి ఉండటానికి సిద్ధమని సవాల్ విసిరారు. తండ్రి ఆశయ సాధన పేరుతో త్వర త్వరగా ముఖ్యమంత్రి కావాలని జగన్ అత్యాశ పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పార్టీ విధివిధానాలపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications