జగన్ అన్నీ దోచుకెళ్లావు మాకేమి మిగిల్చావు, పద్ధతి మార్చుకో: ఆనం

రౌడీయుజం చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పన్నారు. రెండురోజులుగా ఇద్దరు ముఖ్యనేతలపై ఆయన వర్గం దాడులకు పాల్పడిందన్నారు. జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని హెచ్చరించారు. ఎన్నికలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఎవరో కోరుకుంటే వచ్చేవి కావన్నారు. కడపలో రౌడీయిజాన్ని జగన్ పెంచి పోషిస్తున్నాడని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్లు ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారని ఎలా అనుకుంటామని అన్నారు. అలా అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. జగన్ జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications