జగన్ ఇదిగో సాక్ష్యం..., ఆయన సంపాదన న్యాయమైనదా: చిరంజీవి

ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అనడం ఆయన దురహంకారానికి నిదర్శనం అన్నారు. తన సంపాదన న్యాయమైనదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడం తమ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు. తాను ఊహించిన దానికన్నా అనూహ్యమైన స్పందన వస్తుందని అన్నారు.
కాంగ్రెసును గెలిపించడానికి కడప, పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భౌతిక దాడులతో సాధించేది ఏమీ లేదన్నారు. ఓటమి భయంతోనే జగన్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని అవమానిస్తే మహిళలను మొత్తం అవమానించినట్లేనని అన్నారు. జగన్ బిజెపితో కలిసి మైనార్టీలకు అన్యాయం చేయడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications