చెన్నై క్యాంపస్‌లో ఐఐటి విద్యార్థి నితిన్ కుమార్ రెడ్డి ఆత్మహత్య

నితిన్ కుమార్ రెడ్డి కోర్సును మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు డిపార్ట్‌మెంట్ హెడ్ వెంకటేశన్ ఎస్పీ చెప్పారు. దీంతో డిఆర్‌డిఒ అధికారిక పనుల మీద ఉన్న తండ్రి లక్ష్మణమూర్తి రెడ్డికి ఓ లేఖ రాసి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ తనకు ఇచ్చిన ఉద్యోగం దీని వల్ల పోతుందనే భయంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నితిన్ ఆ లేఖలో రాశాడు. తన నిర్ణయాన్ని బెంగళూర్‌లో ఉన్న తన మిత్రురాలికి తెలియజేయాలని కూడా అతను రాశాడు.












Click it and Unblock the Notifications