వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ ఇంటి పక్కనే జాగింగ్‌కు వెళ్లేవాడిని: ముషారఫ్

|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
ది వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా ప్రత్యేక బలగాలు హతమార్చిన స్థలానికి సమీపంలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రోజూ జాగింగ్‌కు వెళ్తుండేవారట. ఇస్లామాబాద్‌కు సమీపం ఉన్న అబ్బోతాబాద్‌ నగరంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో లాడెన్‌ను అమెరికా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం పాకిస్థాన్ మిలటరీ అకాడెమీకు కొన్ని అడుగుల దూరంలో ఉంటుంది. లాడెన్ మృతిపై ముషారఫ్ స్పందిస్తూ.. "ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది, ఈ స్థలం పాకిస్థాన్ మిలటరీ అకాడెమీ పక్కనే ఉంది. ఈ ప్లేస్‌లో నేను రోజూ తొమ్మిది మైళ్లు జాగింగ్ చేసే వాడిని, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంద"ని ఓ వార్తపత్రిక ముషరాఫ్‌ను ఉటంకిస్తూ ప్రచురించింది.

కాగా.. 1999 నుచి 2008 వరకూ తను అధికారంలో ఉన్నప్పుడు లాడెన్ ఎక్కడ దాక్కున్నాడనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయితే ఈ విషయంలో నిఘా లోపించిందని మాత్రం ఒప్పుకున్నారు. "అతను (లాడెన్) ఎక్కడున్నాడో వారికి తెలియదు, దీన్ని వైఫల్యం అనొచ్చు లేదా నిఘాలోపం అనొచ్చు, కానీ ఈ నిఘా లోపం పాకిస్థాన్, అమెరికా రెండు దేశాలకు వర్తిస్తుంద"ని అన్నారు. అబ్బోతాబాద్ నగరం వేలాది మంది సైనికులకు ఇల్లు లాంటిది. అలాంటి స్థలంలో లాడెన్ నివసిస్తుండం సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది. పాకిస్థాన్ దేశంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

English summary
Pakistan former president Pervez Musharraf used to go for jogging next to the place where al-Qaeda chief Osama bin Laden was killed by US special forces. Laden was killed in Abbottabad city near Islamabad, which is very near to Pakistan Military Academy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X