చిదంబరంతో గవర్నర్ నరసింహన్ మంత్రాంగం, తెలంగాణపైనే భేటీ

తెలంగాణ ఉద్యమం తిరిగి ఊపందుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ చిదంబరంతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని గవర్నర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలను త్వరలో చేపడతామని ఆయన చెప్పారు. నరసింహన్ చిదంబరంతో కడప ఉప ఎన్నికల తర్వాత తలెత్తే పరిణామాలపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. చిదంబరానికి గవర్నర్ ఏదైనా నివేదిక సమర్పించారా, లేదా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications