కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలలో గెలుపు కోసం జగన్ వ్యూహ రచన: నేతలతో భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల గెలుపు కోసం తన పార్టీ కార్యకర్తలతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గురువారం పదకొండు గంటల ప్రాంతంలో తన ప్రచారాన్ని ముగించుకున్న జగన్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేతలు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తదితరులుతో భేటీ అయ్యారు. సాధారణంగా భోజన విరామానికి కూడా సమాయాన్ని కేటాయించకుండా నిరాఘాటంగా ప్రచారాన్ని కొనసాగించే జగన్ ఏకధాటిగా నాలుగు గంటల పాటు తన వర్గం వారితో వ్యూహ రచన చేసేందుకు వారితో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సంఘం తమకు కేటాయించిన ఫ్యాన్ గుర్తును వోటర్లలోకి ఎంత వరకు తీసుకు వెళ్లామనే విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత ముప్పయ్యేళ్లుగా చేతి గుర్తుకు అలవాటు పడి పోయిన వోటర్లను ఫ్యాన్ గుర్తుకు మరల్చేలా తగిన విధంగా ప్రచారాన్ని నిర్వహించామా లేదా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రచారానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నందున ఎక్కడైనా ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకొని వోటర్లకు చెప్పే దిశలో చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

ఇంచార్జులు ఎలా పని చేస్తున్నారు. ఏఏ ప్రాంతాలలో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. సానుభూతి కారణంగా టిడిపి సాంప్రదాయక ఓట్లు తమకు ఎంత వరకు పడే అవకాశం ఉందని స్థానిక ఇంచార్జుల నుండి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెంచే దిశలో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో కంటే ఓటింగ్ పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంఛార్జులు ఓటింగ్‌కు దూరంగా ఉండే వారిపై దృష్టి సారించి వారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా చర్యలు తీసుకునేలా చేపట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy was chalked out a strategy with his team to win in Kadapa and Pulivendula by election. He was organiged meeting with Ex minister Konathala Ramakrishna, SPS Nellore MP Mekapati and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X