నేను ఎప్పుడూ జగన్‌తోనే ఉంటా: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: తాను మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వీడాలని చూస్తున్నట్టు వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం చెప్పారు. తాను మొదటి నుండి జగన్‌కు అండగా ఉన్నానని ఇక ముందు కూడా ఎప్పుడూ ఉంటానని చెప్పారు. తాను ఎప్పుడూ జగన్‌ను కాదని వేరే పార్టీలోకి వెళ్లేది లేదని చెప్పారు. కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్లు తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేస్తున్నాయని చెప్పారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలని చెప్పారు.
కాగా జగన్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తుడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈసికి దొరికిన డబ్బంతా కాంగ్రెసు పార్టీదే అని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ మంత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వాహనాల్లో కూడా డబ్బు సరఫరా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. జగన్ నాలుగు లక్షల మెజార్టీతో, విజయమ్మ యాభైవేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.