హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, కాంగ్రెసుకు పోటీ పడుతున్నాయి: చంద్రబాబు ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు
శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ రాజకీయ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను వోటర్లకు పంచి గెలుపొంద వచ్చునని భావిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఏడేళ్ల కాంగ్రెసు, వైయస్ పాలనలో ప్రజా సమస్యలు, అభివృద్ధి పక్కకు పోయి దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఓటర్లు మనస్సాక్షి ప్రకారం ఓటేయాలని కోరారు. వోటుకు నోటు చూసి వోటు వేయవద్దని ఆయన వోటర్లను కోరారు. భ్రష్టు పట్టిన, విలువలు లేని, వ్యక్తిత్వం లేని రాజకీయాలను ప్రోత్సహించవద్దని ఆయన వోటర్లను కోరారు. అక్రమార్కులను ప్రోత్సహించవద్దని కోరారు.

డబ్బుల పంపకంలో జగన్‌తో కాంగ్రెసు పార్టీ కూడా పోటీ పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరూ సిఎంగా గుర్తించడం లేదన్నారు. ఆయన కూడా సిఎంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలిందన్నారు. వరికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేళ్ల కాంగ్రెస్‌ పాలన రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లిందన్నారు. అవినీతిపరులను చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్‌ దౌర్భాగ్య రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

English summary
TDP president Chandrababu Naidu was fired at Ex MP YS Jaganmohan Reddy and Congress party today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X