మాపై ఫిర్యాదులు ఏమీ చేయలేవు, తగిన మెజారిటీతోనే విలీనం: చిరంజీవి

వీలైనంత త్వరలో విలీన సభ ఉంటుందని ఆయన చెప్పారు. విలీన సభకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. విలీన సభ వేదిక, తేదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. విలీన సభను హైదరాబాదులో నిర్వహించాలా, ఢిల్లీలో నిర్వహించాలా అనే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా జరపాలా, పెద్ద యెత్తున జరపాలా అనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.
గులాం నబీ ఆజాద్‌తో మంత్రి పదవులపై గానీ, పార్టీ పదవులపై గానీ తాను చర్చించలేదని, విలీన సభ గురించి మాత్రమే మాట్లాడానని ఆయన చెప్పారు. పదవులకు సంబందించి పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా ఆఫర్ వస్తే పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం సోనియాను కలిసే ఆలోచన లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications