నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ప్రధానం: చిరంజీవి

అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విలీనం గురించి మాట్లాడుకుందామని కాంగ్రెస్ పెద్దలు చెప్పిన నేపథ్యంలోనే తాను వచ్చాను తప్ప ఇతర కారణాలేమీ లేవన్నారు. విలీనం తేదీ, వేదికలు ఒకటి రెండురోజుల్లో ఖరారవుతాయని తెలిపారు. కేంద్ర పదవుల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు తనను ఎక్కడికి తీసుకోవాలన్నది వారే నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం బెదిరింపు కాదన్నారు. అది చట్టబద్ధంగా పార్టీలకున్న హక్కు అని పేర్కొన్నారు. కడప ఉప ఎన్నికల ఫలితాలపై ముందుగానే వ్యాఖ్యానించడం సబబు కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications