మాజీ ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు, గుంటూరు జిల్లాలో దారుణం

శ్రీకాంత్, శాంతి కొంత కాలం సహజీవనం చేశారు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఆమెను వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తమకు కలిగిన కుమారుడిని ఎవరు పోషించాలనే విషయంపై శ్రీకాంత్, శాంతిల మధ్య వివాదం చోటు చేసుకుంది. కుమారుడి బాధ్యతలు తీసుకోవాలని శాంతి శ్రీకాంత్‌ను కోరింది. దానికి శ్రీకాంత్ నిరాకరించాడు. దీంతో ఆమె ఇంతకు ముందు శ్రీకాంత్‌పై కేసు పెట్టింది. ఈ కేసులో శ్రీకాంత్ అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యాడు.
బుధవారం శాంతి శ్రీకాంత్ వద్దకు వెళ్లింది. ఈ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా శాంతి ఆగ్రహంతో పక్కనే ఉన్న టైలర్ షాపు నుంచి కత్తి తీసుకుని అతన్ని పొడిచింది. అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications