నోయిడా గ్రామంలోకి దూసుకొచ్చిన రాహుల్, యుపి పోలీసులకు టోకరా

Rahul Gandhi
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులకు టోకరా ఇచ్చి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ భూవివాదం చెలరేగుతున్న నోయిడా గ్రామాల్లో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయన గ్రేటర్ నోయిడాలోని భట్ట పర్సోల్ గ్రామాన్ని సందర్శించారు. ఆందోళనకు దిగిన రైతులను పలకరించారు. మాయావతి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు నష్టపరిహారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

యుమునా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణఆనికి స్వాధీనం చేసుకున్న తమ భూములకు నష్టపరిహారం పెంచాలని రైతులు ఆందోళన చేపట్టారు. తన కావల్కేడ్‌ను రెండు కిలోమీటర్ల దూరంలో ఆపేసి సాధారణ వ్యక్తిలా రాహుల్ గాంధీ బైక్‌పై గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్న రైతుల ఇంటింటికీ వెళ్లారు. వారి సమస్యను విన్నారు. రైతులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ పర్యటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని సవాల్ చేయడమేనని అంటున్నారు. గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధించింది. రైతుల ఆందోళనలో ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు వ్యక్తులు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+