ప్యాట్నీ కంప్యూటర్స్ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు ఐగేట్ తెలిపింది. ఫణీష్ మూర్తిని సీఈవోగా నియమిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుత సీఈవో జయకుమార్ ఆ పదవినుంచి వైదలగనున్నారు. ప్యాట్నీ కొనుగోలుకి ఈ జనవరి 10న ఐగేట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాన ప్రమోటర్లు నరేంద్ర ప్యాట్నీ , అశోక్ ప్యాట్నీ, గజేంద్ర ప్యాట్నీలతోపాటు జనరల్ అట్లాంటిక్‌ల వాటాలను సొంతం చేసుకుంది. నిబంధనల ప్రకారం వాటాదారుల నుంచి కూడా 20% వాటాను టెండర్ ద్వారా కొనుగోలు చేసింది. వెరసి ప్యాట్నీలో ఐగేట్ వాటా సుమారు 83%కు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో విడిగా రెండు కంపెనీల లిస్టింగ్ కొనసాగుతుందని ఐగేట్ ఈ సందర్భంగా తెలిపింది.
iGate has finally completed the acquisition of Patni Computer Systems, one of the biggest transactions in the information technology (IT) services space so far. Phaneesh Murthy, who would take over as the CEO and MD of the combined entity iGate Patni, is all set to compete with the likes of IBM, Accenture, Infosys and Congnizant and has given two years' time for the company to hit the road on full speed.