రాష్ట్రపతి పాలనకు నో చెప్పనున్న కేంద్రం: కర్నాటకపై వెనుకడుగు!

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిందని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటే స్తబ్దగా ఉన్న ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తుతుందని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన అకస్మాత్తుగా పెడితే ప్రభుత్వం కొనసాగకుండా చేసిందనే అపవాదును మూట కట్టుకోవాల్సి వస్తుందని వారు భావిస్తున్నారని సమాచారం. తద్వారా బిజెపి కర్నాటకలోనే కాకుండా జాతీయంగా లాభ పడుతుందని, వారికి ఆ అవకాశం ఇవ్వవద్దని కేంద్రం యోచిస్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు యెడ్యూరప్పకు మరికొంత గడువు ఇవ్వాలని, అప్పటికీ ఆయన ఎమ్మెల్యేల బలం నిరూపించుకోలేక పోతే అప్పుడు చర్యలు తీసుకుంటే తమకు నష్టం ఉండదని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
యెడ్యూరప్ప బలం నిరూపించుకోకపోతే కాంగ్రెసు, జెడిఎస్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరే అవకాశం ఉంది. తమకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. అలాంటప్పుడు నేరుగా ఎన్నికలకే వెళ్లవలసి ఉంటుంది. అప్పుడు బిజెపి మళ్లీ లాభపడటం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయంపై ప్రధాని, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఎకె అంటోనీ, ఎస్ఎం కృష్ణ తదితరులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications