ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గండం గట్టెక్కినట్లే, ఆజాద్ సంకేతాలు

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, కడప ఉప ఎన్నికల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామనే విషయాలపైనే ఆజాద్ ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని, ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం బాగాలేదని నాయకులు చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి వ్యవహార శైలేనని కూడా చెప్పారు. దీంతో ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం జోరందుకుంది.
వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రభావం చూపుతోందని, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం బలంగా ఉందని, దానివల్ల ధిక్కార స్వరాలు పెరగడానికి అవకాశం ఉంటుందని నాయకులు ఆజాద్‌తో చెప్పారు. ఏమైనా, పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరు బాగు పరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆజాద్ ప్రముఖంగా దృష్టి సారించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications