ఇంటర్నెట్ లేకున్నా మొబైల్‌లో ఫేస్‌బుక్ త్వరలో సేవలు ప్రారంభం

యూఎస్‌ఎస్‌డీ అంటే అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటాకు పొట్టి పేరు. దీని ద్వారా గ్రాఫిక్స్‌ను పొందే వీలు లేకపోయినా, ఇది యూజర్లకు వారి స్నేహితుల ఫేస్‌బుక్ వాల్స్‌కు అప్‌డేట్‌లను పంపడానికి, లేదా అటువంటి అప్‌డేట్‌లను తాము చూడటానికి తోడ్పడుతుందని మీనన్ వివరించారు. ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో కలసి యుటోపియా, ఈ అప్లికేషన్‌ను మంగళవారం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ కస్టమర్లు వారి ఫేస్‌బుక్ స్టేటస్‌ను ఈ సౌకర్యం ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
పూర్తి ఫీచర్ అప్లికేషన్‌లు పొందాలంటే మాత్రం రోజుకు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ యూజర్లు డేటా ప్లాన్‌లకు చందా కట్టకుండానే నాన్- క్వెర్టీ మొబైల్ సెట్‌లపై ఫేస్‌బుక్ అందుబాటు (ఏక్సెస్) కోసం *325#మరియు *fbk#కు డయాల్ చేయవచ్చని భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications