వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసి రిజర్వేషన్లు తగ్గకుండా చూస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు తగ్గకుండా చూస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. బిసి రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ జివో జారీ చేసినట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బిసి రిజర్వేషన్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలో నిజం లేదని, రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఆ విధమైన విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అవసరమైతే బిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కూడా ఆయన చెప్పారు. బిసి రిజర్వేషన్లు చదువులోనే కాకుండా ఉద్యోగాల్లో కూడా మేలు చేస్తాయని ఆయన అన్నారు. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదని, ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకున్నాయి.

English summary
Minister Botsa Satyanarayana said that BC reservations will not be reduced. He announced that BC reservations will be implemented another 10years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X