బిజెపిలో నేతలు ఎక్కువ క్యాడర్ తక్కువ: ఎపి లీడర్లు మేల్కొనేది ఎన్నడో

తాజాగా బుధవారం అన్నదాతల సమస్యలపై ఇందిరాపార్కు వద్ద బిజెపి చేపట్టిన ఆందోళనలో కూడా నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువగా కనిపించారు. పట్టుమని వందమంది కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొనలేదు. ఆ ధర్నాలో ఇద్దరు కేంద్రమంత్రులు, నలుగురు జాతీయ నాయకులతో పాటు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయినప్పటికీ కార్యకర్తలను సమీకరించడంలో రాష్ట్ర పార్టీ విఫలం అయింది. అక్కడ నేతల హల్ చల్ మాత్రమే కనిపించింది.
ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిద్రలా కనిపించడంతో పరిస్థితి గమనించిన వెంకయ్యనాయుడు చలో సెక్రటరియేట్ అని కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వెంకయ్యనాయుడు చర్యల వల్ల అక్కడ ఆందోళన కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపించింది. అంతేకాదు ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి కూడా ఎవరూ లేనట్లుగా వెంకయ్య నినాదాలు ఇచ్చే వరకు అందరూ మిన్నకుండి పోయారంట. మరి దేశంలో అతిపెద్ద రాష్ట్రం, ప్రధానమైన రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసే దృష్టి పార్టీ ఎప్పుడు దృష్టి సారిస్తుందో చూడాలి. అయితే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అయిన తర్వాత కాస్త పార్టీ బలోపేతం దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications